Friday, 15 March 2013

నరకం

నరకం

 
 
ఈ లోకంలో మనుషులు తమ క్షణిక సుఖాల కోసం అనేక దుష్కర్మలు చేస్తారు. ఈ దుష్కర్మల ఫలితంగా మనిషికి మృత్యువు తరువాత భోగదేహం ప్రాప్తిస్తుందని మన పురాణాలు చెపుతున్నాయి. ఈ విధమైన బోగదేహం రెండు రకాలు. ఒకటి సూక్ష్మ దేహం ఇది మనిషి ఆచరించిన సత్కర్మల ఫలితంగా కలిగే సుఖాలను అనుభవించడానికి స్వర్గాది ఊర్ధ్వలోకాలకు చేరుతుంది. రెండవది యాతనా దేహం . ఇది మానవుడు చేసిన పాప ఫలాలను అనుభవించడానికి నరకాది లోకాలకు చేరుతుంది. మృత్యువు తరువాత వెంటనే కొత్త దేహం ధరించటం వీలుకాదు. కొత్త దేహ ప్రాప్తికి ముందు జీవి మనోమయ ప్రాణమయ దేహంచేత, సుకృత, దుష్కృత సుఖ దుఃఖాల ఫలితాలను అనుభవించవలసి వస్తుంది.
Gehenna, 2007

విషయ సూచిక

[దాచు]

[మార్చు] నరకాలలో రకాలు

[మార్చు] హిందువుల నరకం

మహాభాగవతంలో యాతనా దేహం అనుభవించే వివిధ నరకశిక్షలు వాటిని అమలుచేసే 28 నరకాల వర్ణన వున్నది.
యముని సభ, circa 1800


  1. అంధతామిస్ర నరకం:
  2. రౌరవము :
  3. మహా రౌరవము :
  4. కుంభీపాక నరకం:
  5. కాలసూత్ర నరకం:
  6. అసిపత్ర వనము:
  7. సూకర ముఖము:
  8. అంధకూపము:
  9. క్రిమి భోజనం:
  10. నందశన:
  11. తప్తసూర్మి:
  12. వజ్రకంటక శాల్మలి:
  13. వైతరణి :
  14. పూయాదన:
  15. ప్రాణరోధ:
  16. వైశాన:
  17. లాలాభక్ష:
  18. సారమేయోదనము:
  19. అవిచి మంత:
  20. అయపానము:
  21. క్షారకర్దమ:
  22. రక్షో గణబోధన:
  23. శూల ప్రోతము:
  24. దండసూకర:
  25. అవధినిరోధన:
  26. పర్యావర్తన:
  27. సూచిముఖి:

[మార్చు] క్రైస్తవుల నరకం

అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు.ఏడుపు పళ్ళుకొరుక్కోటం ఉంటాయి.

[మార్చు] ముస్లిముల నరకం

ఏడు ద్వారాలుంటాయి.త్రాగటానికి సలసల కాగే నీరూ చీమూ నెత్తురూ ఇవ్వబడతాయి.అదిశుద్ధిచేసే అగ్నిగుండం హృదయాలను దహించే అగ్ని జ్వాల. ఈ నరకంలో కాఫిర్(నాస్తికులు)ని పొయ్యిలో పెట్టి వంట చెరుకుగా ఉపయోగిస్తారు. వీళ్ళ నరకం ప్రకారం కూడా నరకానికి మాలిక్(రాజు) ఉంటాడు. దేవ దూతలు చనిపోయిన మనిషి సమాధి దగ్గరకి వచ్చి అతని పాప పుణ్యాలు విచారించి, అతను పాపి లేదా నాస్తికుడు లేదా దేవున్ని నమ్ముతున్నట్టు నటించినవాడు అయితే అతన్ని నరకానికి తీసుకుపోతారు.

[మార్చు] గ్రీక్ పురాణాలలో నరకం

గ్రీక్ పురాణాల ప్రకారం ప్లూటో నరకానికి రాజు.

వైతరణీ నది

వైతరణీ నది

 
(
వైతరణి నది అతి ప్రాచీనమైన గరుడ పురాణంలో పేర్కొనబడి ఉన్నది. పాపములు చేసిన వారు చని పోయిన పిమ్మట ఈ నది దాటే వెళ్ళాలి. గరుడ పురాణం ప్రకారం ఈ నది యమలోకానికి దక్షిణాన ఉన్న ద్వారానికి వెలుపల ప్రవహించును. కేవలం పాపులు మాత్రమే చనిపోయిన పిమ్మట ఈ ద్వారం గూండా లోనికి వస్తారని ఇందులో పేర్కొన బడినది.

విషయ సూచిక

[దాచు]

[మార్చు] 1. వర్ణన

ఈ నది అతి భయంకరమైనది, దీంట్లో నుండి వెళ్ళె సమయములో వచ్చే భాదకు పాపాలన్ని గుర్తుకు వస్తాయని పెర్కొనబడినది. ఈ నది కొన్ని వేల మైళ్ళా వెడల్పు కలిగి ఉన్నది. ఈ నదిలో నీరుకి బదులుగా రక్తము, చీము, ఎముకలు, బురద వలె కనిపించే మాంసము ఉండును. ఈ నదిలో చాలా పెద్ద మొసళ్ళు మరియు మాంసము తినే క్రిములు, జంతువులు, పక్షులు వుండడము వలన పాపాత్ములకు ఈ నది దాటి వెళ్ళడం అసాధ్యం. ఇవే కాక సృష్టిలో వుండే మాంసహారులన్ని వుండును.
వైతరణీ నదీ వైశాల్యాన్ని మినహాయించి యమపురి 86 వేల ఆమడల దూరంలో ఉంది ఆమడ అంటే యోజనం. నాలుగు క్రోసుల దూరం ఒక ఆమడ. మరణానంతరం జీవుడు ఈ మార్గాన్ని ఒక రాత్రి, ఒక పగలు(మొత్తం ఒక్క రోజు కాలంలో) 247 ఆమడల చొప్పున నడుస్తూ సౌమ్యము, సౌరి, నాగేంద్ర భవనము, గంధర్వ, శైలాగను, క్రౌంచ, క్రూర, విచిత్ర భవన, బహ్వా పద, దుఖఃద, నానాక్రంద, సుతప్త, రౌద్ర, వయోవర్షణ, శీతాడ్య, బహుభీతి అనే పదహారు పురాలు దాటుకుని యమపురికి చేరుతాడు. ఊనషాణ్మాసికం (171 వ రోజు) పిండాలు భుజించిన తరువాత యముని సోదరుడైన విచిత్ర రాజు పరిపాలించే విచిత్ర భవనం అనే పట్టణాన్ని చేరతాడట. అక్కడ నుంచే వైతరణి దాటాలి.
గోదానం చేసినవారు పడవలో ఆ వైతరణి దాటగలరుగాని, లేని వారికి ఆ నదీ జలం సలసల కాగుతూ కనపడుతుంది. పాపాత్ముడు అందులో దిగి నడవవలసిందే, ఆ పాపాత్ముని నోట ముల్లు గుచ్చి, చేపను పైకి లాగినట్లు లాగి యమ కింకరులు ఆకాశ మార్గాన నడుస్తూ జీవుణ్ణి ఆ నది దాటిస్తారు. శీతాడ్యనగరంలో పాపపుణ్యాలు లెక్కలు ఆరా తీయబడి జీవి సంవత్సరీకాలు అనగా ప్రధమాబ్దికం రోజు పిండోదకాలు తీసుకున్నాక బహుభీతి పురాన్ని చేరతాడు.
హస్త ప్రమాణ పిండరూప శరీరాన్ని అక్కడ విడిచి అంగుష్ట ప్రమాణంలో ఉండే వాయు రూపమైన శరీరాన్ని అంటే యాతనా శరీరాన్ని దాల్చి కర్మానుభవము కోసం యమభటులతో యమపురికి చేరువవుతాడు. ప్రారబ్ద కర్మ అనుభవించడానికే యాతనా శరీరంతో జీవుడు పాపాత్ములతో కలసి యమపురి చేరతాడు. శ్రాద్ధ కర్మలు సరిగ్గా ఆచరించకపోతే ఆ ప్రయాణం కూడా మరింత క్లేశాలతో కూడినదవుతుందట.

[మార్చు] 2. దాటడానికి మార్గాలు

ఈ నదిని దాటుటకు కొన్ని విభిన్న మార్గాలు గలవు. ఐతే ఒక విషయం గమనించవలసింది ఏమిటంటే కేవలము పాపాలు చెసినవారు మాత్రమే ఈ నది గూండా ప్రయాణం చేయవలసి ఉంటుంది. అనగా ఏ ఒక్క పాపము చెయ్యని వారు, మంచి కర్మలను చేయువారు ఈ మార్గము అనగా దక్షిణ ద్వారము గూండా రారు, ఇంకా చెప్పలంటే యమ లోకనికే రారు.

[మార్చు] 3. నది దాటాక

ఈ నది దాటిన పిమ్మట పాపులు దక్షిణ ద్వారము నకు చేరుకొందురు.

[మార్చు] అబద్ధమాడిన వారు నరకాన్ని చవి చూడాల్సిందే

ధర్మదేవత వెంట స్వర్గానికి బయలుదేరిన ధర్మరాజుకు దోవలో వైతరణి ఎదురైంది. దోవంతా దుర్గంధంతో నికృష్టంగా ఉంది. అంతా అంధకారం. మాంసం, నెత్తురు, ఎముకలు, కేశాలు, ప్రేతాల గుంపులు, ముసురుకుంటున్న ఈగలు, క్రిమికీటకాలు కనిపిస్తున్నాయి. ఆ దుర్గంధాన్ని తట్టుకోలేక సొమ్మసిల్లిపోయాడు. దుర్యోధనాదులు స్వర్గంలో ఉంటే ఏ పాపం చేయని నా సోదరులు, భార్య ఈ నరకంలో ఉండటమేమిటి? అన్నాడు ధర్మరాజు. ఇంద్రుడు ధర్మరాజు అనుభవించిన ఆ నరకం కురుక్షేత్ర సంగ్రామం సమయంలో ఆయన ఆడిన అసత్య ఫలితమన్నాడు. అశ్వత్థామ హతః అని పెద్దగా అని, కుంజరః అని చిన్నగా పలికి గురువైన ద్రోణుడిని వంచించిన పాపానికి, ఆ కొద్దిసేపటి నరకం అనుభవించాల్సి వచ్చిందని అన్నాడు. అబద్దమాడిన వారికే నరకం తప్పకపోతే, నరహత్య చేసే వాళ్లకు ఎలాంటి శిక్షలుంటాయో?

మహా భారతము

మహా భారతము

 
మహాభారతం పంచమ వేదము గా పరిగణించబడే భారత ఇతిహాసము. ఈ మహాకావ్యాన్ని వేదవ్యాసుడు చెప్పగా గణపతి రచించాడు. 18 పర్వములతో, లక్ష శ్లోకములతో (74,000 పద్యములతో లేక సుమారు 18 లక్షల పదములతో) ప్రపంచము లోని అతి పెద్ద పద్య కావ్యములలో ఒకటిగా అలరారుచున్నది. సంస్కృతములో ఉన్న ఈ మహా కావ్యాన్ని, కవిత్రయము గా పేరు పొందిన నన్నయ, తిక్కన, ఎర్రన (ఎఱ్ఱాప్రగడ)లు తెలుగు లోకి అనువదించారు.
వ్యాసుడు చెప్పగా వినాయకుడు మహాభారతాన్ని వ్రాశాడని పురాణ కధనం

విషయ సూచిక

[దాచు]

[మార్చు] కావ్య ప్రశస్తి

"యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి న తత్క్వచిత్" - "ఇందులో ఏది ఉందో అదే ఎక్కడైనా ఉంది. ఇందులో లేనిది మరెక్కడా లేదు" అని ప్రశస్తి పొందింది. హిందువులకు ఎంతో పవిత్ర గ్రంథాలైన భగవద్గీత, విష్ణు సహస్రనామ స్తోత్రము కూడా మహాభారతంలోని భాగాలే. దీనిని బట్టి ఈ కావ్య విశిష్టతను అంచనా వేయవచ్చును.
ఈ కావ్యవైభవాన్ని నన్నయ:
దీనిని ధర్మ తత్త్వజ్ఞులు ధర్మశాస్త్రమనీ, ఆధ్యాత్మవిదులు వేదాంతమనీ, నీతి విచక్షణులు నీతి శాస్త్రమనీ, కవులు మహాకావ్యమనీ అంటారు. లాక్షణికులు సర్వ లక్షణ సంగ్రహమనీ, ఐతిహాసికులు ఇతిహాసమనీ, పౌరాణికులు బహుపురాణ సముచ్ఛయమనీ కొనియాడుతారు. వివిధ తత్త్వవేది, విష్ణు సన్నిభుడు అయిన వేదవ్యాసుడు దీనిని విశ్వజనీనమయ్యేలా సృజించాడు.
మహాభారత గాథను వ్యాసుడు ప్రప్రథమంగా తన శిష్యుడైన వైశంపాయనుడి చేత సర్పయాగం చేయించేటపుడు జనమేజయ మహారాజుకి చెప్పించగా, అదే కావ్యాన్ని తరువాత నైమిశారణ్యంలో శౌనక మహర్షి సత్రయాగము చేయుచున్నప్పుడు సూతమహర్షి అక్కడకు వచ్చిన ఋషులకు చెప్పాడు.

మహాభారతాన్ని చెరకుగడతో పోల్చారు. పర్వము అంటే చెరకు కణుపు. 18 కణుపులు (పర్వములు) కలిగిన పెద్ద చెరకుగడ, మహాభారతం. చెరకును నములుతున్న కొద్దీ రసం నోటిలోకి వచ్చి, నోరు తీపి ఎక్కుతుంది. అలాగే భారతాన్ని చదివిన కొద్దీ జ్ఞానం పెరుగుతుంది.

[మార్చు] మహాభారతంలోని విభాగాలు

మహాభారతంలో 18 పర్వములు, వాటిలో జరిగే కథాక్రమం ఇది:
  1. ఆది పర్వము: 1-19 ఉపపర్వాలు - పీఠిక, కురువంశం కథ, రాకుమారుల జననం, విద్యాభ్యాసం.
  2. సభా పర్వము: 20-28 ఉపపర్వాలు - కురుసభా రంగం, మయసభ, పాచికల ఆట, పాండవుల ఓటమి, రాజ్యభ్రష్టత.
  3. వన పర్వము (లేక) అరణ్య పర్వము: 29-44 ఉపపర్వాలు - అరణ్యంలో పాండవుల 12 సంవత్సరాల జీవనం.
  4. విరాట పర్వము: 45-48 ఉపపర్వాలు - విరాటరాజు కొలువులో ఒక సంవత్సరం పాండవుల అజ్ఞాతవాసం.
  5. ఉద్యోగ పర్వము: 49-59 ఉపపర్వాలు - కౌరవ పాండవ సంగ్రామానికి సన్నాహాలు.
  6. భీష్మ పర్వము: 60-64 ఉపపర్వాలు - భీష్ముని నాయకత్వంలో సాగిన యుద్ధం.
  7. ద్రోణ పర్వము 65-72 ఉపపర్వాలు - ద్రోణుని నాయకత్వంలో సాగిన యుద్ధం.
  8. కర్ణ పర్వము: 73 వ ఉపపర్వము - కర్ణుని నాయకత్వంలో సాగిన యుద్ధం.
  9. శల్య పర్వము: 74-77 ఉపపర్వాలు - శల్యుడు సారథిగా సాగిన యుద్ధం.
  10. సౌప్తిక పర్వము: 78-80 ఉపపర్వాలు - నిదురిస్తున్న ఉపపాండవులను అశ్వత్థామ వధించడం.
  11. స్త్రీ పర్వము: 81-85 ఉపపర్వాలు - గాంధారి మొదలగు స్త్రీలు, మరణించినవారికై రోదించడం.
  12. శాంతి పర్వము: 86-88 ఉపపర్వాలు - యుధిష్ఠిరుని రాజ్యాభిషేకం. భీష్ముని ఉపదేశాలు.
  13. అనుశాసనిక పర్వము: 89-90 ఉపపర్వాలు - భీష్ముని చివరి ఉపదేశాలు (అనుశాసనాలు)
  14. అశ్వమేధ పర్వము: 91-92 ఉపపర్వాలు - యుధిష్ఠిరుని అశ్వమేధ యాగం.
  15. ఆశ్రమవాస పర్వము: 93-95 ఉపపర్వాలు - ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి ప్రభృతులు చివరి రోజులు ఆశ్రమవాసులుగా గడపడం.
  16. మౌసల పర్వము: 96వ ఉపపర్వం - యదువంశంలో ముసలం, అంతఃకలహాలు.
  17. మహాప్రస్ధానిక పర్వము: 97వ ఉపపర్వం - పాండవుల స్వర్గ ప్రయాణం ఆరంభం.
  18. స్వర్గారోహణ పర్వము:98వ ఉపపర్వం - పాండవులు స్వర్గాన్ని చేరడం.
హరివంశ పర్వము: శ్రీకృష్ణుని జీవితగాథ వీటిలో మొదటి అయిదు పర్వాలను ఆదిపంచకము అనీ, తరువాతి ఆరు పర్వాలను యుద్ధషట్కము అనీ, ఆ తరువాతి ఏడు పర్వాలను శాంతిసప్తకము అనీ అంటారు.

[మార్చు] మహాభారతం ప్రత్యేకతలు

  • మహాభారత రచన చేసినది పరాశర మహర్షి కుమారుడయిన వేదవ్యాసుడు.
  • మహాభారతకథను వ్యాసుడు రచన చేసిన సమయం మూడు సంవత్సరాలు .
  • మహాభారతకథను చెప్పడానికి స్వర్గలోకంలో నారద మహర్షిని, పితృలోకములో చెప్పడానికి దేవల మహర్షిని, గరుడ గంధర్వ లోకాలలో చెప్పడానికి శుక మహర్షిని, సర్పలోకంలో చెప్పడానికి సుమంతుడిలని, మానవలోకంలో చెప్పడానికి వైశంపాయన మహర్షిని నియమించాడు.
  • అంతకు పూర్వం దేవాసురయుధ్దంలా కురుక్షేత్రంలో మహాభారత యుద్ధం జరిగింది.
  • ఈ యుద్ధంలో భీష్ముడు 10 రోజులు, ద్రోణుడు 5 రోజులు, కర్ణుడు 2 రోజులు , శల్యుడు అర్ధరోజు సైన్యాధ్యక్షత వహించారు. మిగిలిన సగం రోజు భీముడు ధుర్యోధనుడితో యుద్ధం చేసాడు.
  • ఈ యుద్ధంలో పోరాడి మరణించిన వారి సంఖ్య 18 అక్షౌహిణులు. వీరిలో కౌరవ పక్షం వహిండి పోరాడిన వారి సంఖ్య 11 అక్షౌహిణులు. పాండవ పక్షం వహిండి పోరాడిన వారి సంఖ్య 7అక్షౌహిణులు.
  • ఈ యుద్ధం జరిగిన ప్రదేశం శమంతక పంచకం. తన తండ్రిని అధర్మంగా చంపిన క్షత్రియ వంశాల మీద పరశురాముడు 21 పర్యాయమపలు భూమండలం అంతా తిరిగి దండయాత్ర చేసి క్షత్రియ వధ చేసిన సమయంలో క్షత్రియ రక్తంతో ఏర్పడ్డ ఐదు తటాకాలే ఈ శమంతక పంచకం. పరశురాముడు తన తండ్రికి ఇక్కడ తర్పణం వదిలి క్షత్రియుల మీద తనకు ఉన్న పగ తీర్చుకున్నాడు.
  • పంచమ వేదంగా వర్ణించబడే ఈ మహాభారతాన్ని కవులు మహాకావ్యమని, లాక్షణికులు సర్వలక్షణాలు కలిగిన గ్రంధరాజమని, పౌరాణికులు అష్టాదశపురాణ సారమని, నీతిశాస్త్రపారంగతులు నీతి శాస్త్రమని, తత్వజ్ఞులు ధర్మశాస్త్రమని, ఇతిహాసకులు ఇతిహాసమని ప్రశంసించారు.
  • వినాయకుని ఆదేశానుసారం వేదవ్యాసుడు ఆగకుండా చెప్తుంటే నినాయకుడు తన దంతమును విరిచి ఘంటముగా చేసికొని మహాభారతకథను లిఖించాడు.
  • మహాభారతంలోని పర్వాలు 100. పైష్యమ, ఆస్తీకము, ఆదివంశావతారం, సంభవపర్వము, జతుగృహదాహము, హైడంబము, బకవధ, చైత్రరధము, ద్రౌపదీస్వయంవరం, వైవాహికం, విదురాగమనము, రాజ్యార్ధలాభము, అర్జునతీర్ధయాత్ర, సుభద్రాకల్యాణం, హరణహారిక, ఖాండవదహనం, మయదర్శనం,
సభాపర్వము, మంత్రపర్వము, జరాసంధవధ, దిగ్విజయము, రాజసూయము, బర్ఘ్యాభిహరణం, శిశుపాలవధ, ద్యూతము, అనుద్యూతము, అరణ్యము, కిమ్మీరవధ, కైరాతము, ఇంద్రలోకాభిగమనం, ధర్మజతీర్ధయాత్ర, జటాసురవధ, యక్షయుద్ధం, అజగరం, మార్కడేయోపాఖ్యానం, సత్యాద్రౌపదీ సంవాదం, ఘోషయాత్ర, ప్రాయోపవేశం, వ్రీహి ద్రోణాఖ్యానం, ద్రౌపదీహరణం, కుండలాహరణం, ఆరణేయం, వైరాటం, కీచకవధ, గాగ్రహణం, అభిమన్యువివాహం, ఉద్యోగం, సంజయయానం, ధృతరాష్ట్రప్రజాగరణం, సానత్సుతజాతం, యానసంధి, భగవద్యానం, సైనానిర్యాత, ఉలూకదూతాభిగమనం, సమరధ, అతిరధ సంఖ్యానము, కర్ణభీష్మవివాదం, అబోపాఖ్యానం, జంబూఖండవినిర్మాణం, భూమిపర్వము, భీష్మాభిషేకం, భగవద్గీత, భీష్మవధ, ద్రౌణాభిషేకం, సంశప్తకవధ, అభిమన్యువధ, ప్రతిజ్ఞాపర్వం, జయద్రధవధ, ఘటోత్కచవధ, ద్రోణవధ, నారాయణాస్రప్రయోగం, కర్ణపర్వం, శల్యపర్వం, హ్రదప్రవేశం, గదాయుద్ధం, సారసత్వం, సౌప్తిక పర్వం, వైషీకం, జలప్రదానం, స్త్రీపర్వం, శ్రాద్ధపర్వం, రాజ్యాభిషేకం, చార్వాక నిగ్రహం, గృహప్రనిభాగం, శాంతిపర్వం, రాజధర్మానుకీర్తనం, ఆపద్ధర్మం, మోక్షధర్మం, ఆనుశాసనికం, భీష్మస్వర్గారోహణం, అశ్వమేధం, అనుగీత, ఆశ్రమవాసం, పుత్రసందర్శనం, నారదాగమనం, మౌసలం, మహాప్రస్థానం, హరివంశం, భనిష్యత్పర్వం.

[మార్చు] కురు వంశవృక్షం

కురు
గంగాదేవి
శంతనుడు
సత్యవతి
పరాశరుడు
భీష్ముడు
వ్యాసుడు
అంబిక
విచిత్రవీర్యుడు
అంబాలిక
ధృతరాష్ట్రుడు
గాంధారి
శకుని
కుంతి
పాండు రాజు
మాద్రి
కర్ణుడు
యుధిష్ఠిరుడు
భీముడు
అర్జునుడు
నకులుడు
సహదేవుడు
దుర్యోధనుడు
దుస్సల
దుశ్శాసనుడు
(98 మంది పుత్రులు)


సంకేత సూచీ:
సూచనలు
  • : కురు మహా సామ్రాజ్యాన్ని స్థాపించిన పూర్వీకుడు కురుకు కొన్ని తరాల తరువాతి రాజు, శంతనుడు. సత్యవతిని పెళ్ళాడే ముందు అతడు గంగను పెడ్లాడాడు.
  • : విచిత్రవీర్యుని మరణం తరువాత, వ్యాసుని వలన ధృతరాష్ట్రుడు, పాండు రాజు జన్మించారు.
  • : కుంతి వివాహానికి ముందే సూర్యుని వరం చేత ఆమెకు కర్ణుడు జన్మించాడు.
  • : పాండవులు పాండు రాజు పుత్రులైనప్పటికీ, దేవతల వరం చేత కుంతి, మాద్రిలకు వీరు కలిగారు. ఆ వివరాలు:
  • : దుర్యోధనుడు, అతని శతసోదరులు ఒకేసారి జన్మించారు.

[మార్చు] తెలుగు సినిమాలలో భారతగాథ

మహాభారత కథ ఇతివృత్తంగా ఎన్నో తెలుగు సినిమాలు వెలువడ్డాయి. పౌరాణిక ఇతివృత్తాలను తెరకెక్కించడంలో తెలుగువారికున్న నైపుణ్యం కారణంగా వాటిలో చాలా సినిమాలు చిరస్థాయిగా జనాదరణ పొందాయి. వాటిలో కొన్ని:


[మార్చు] మహాభారతంలోని 18 విభాగాల విడియో ప్రసంగాలు